Thursday 13 September 2012

నిద్రలో వీర్యం పోతోంది.. నాలో టెన్షన్ పుడుతోంది ఏం చేయాలి?


youth
File
FILE
సాధారణంగా యుక్త వయస్సులో ఉండే యువకుల్లో సెక్స్ కోర్కెలు ఎక్కువగా కలగడం వల్ల నిద్రలో వీర్య స్ఖలనం తానంతట అదే జరిగిపోతోంది. మరికొందరిలో బూతు బొమ్మల చిత్రాలు ఊహించుకుంటూ.. తమకు ఇష్టమైన అమ్మాయితో సెక్స్ చేస్తున్నట్టు అనుభూతికి లోనవుతూ వీర్యాన్ని స్ఖలిస్తుంటారు. ఈ అలవాటు చాలా మంది యువకుల్లో ఉంటుంది. వీర్యం వృధాగా పోతుండటంతో వారు ఆందోళన చెందుతూ, టెన్షన్ పడుతుంటారు. అసలు వీర్య స్ఖలనం కాకుండా ఉండేందుకు మాత్రలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై కూడా వారు ఆరా తీస్తుంటారు. ఇదే అంశంపై సెక్స్ వైద్యులను సంప్రదిస్తే.. 

వీర్య స్ఖలనానికి ఎలాంటి మందులూ వాడక్కరలేదంటున్నారు. ఎందుకంటే, రాత్రి నిద్రలో వీర్యం పోయినా, హస్త ప్రయోగంలో పోయినా ఏ నష్టమూ రాదని అంటున్నారు. ఇల కలగడాన్ని 'స్వప్న స్ఖలనాలు' అంటారని చెపుతున్నారు. ఇవి చాలా సహజమైనవి. శరీర ధర్మమని అభిప్రాయపడుతున్నారు. 

సాధారణంగా యుక్త వయస్సు అంటే 13 - 15 సంవత్సరాలు వచ్చేసరికి 50 శాతం మంది మగపిల్లలు స్వప్నస్ఖలనాలు జరుగుతుంటాయని చెపుతుంటారన్నారు. పురుష - అంతర్గత జననాంగాలైన ప్రోస్టేట్ గ్రంథి, సెమైనల్ వెసైకల్స్ వృద్ధి చెంది వీర్యంలో ఉండే ద్రవాలను స్రవించడం మొదలు పెడతాయి. 

బీజాలలో వీర్య కణాలు తయారవుతాయి. పురుష శృంగార హార్మోన్లు టెస్టోస్టీరాన్లు కోరికను కలిగిస్తాయి. రాత్రి కలలు వచ్చినా, రాకున్నా అంగస్థంభన కలిగి వీర్యస్ఖలనాలు జరిగిపోతుంటాయని చెపుతున్నారు. వీటిని ఎవరూ ఆపలేరంటున్నారు.