Thursday 13 September 2012

నా భార్యకు యాభై యేళ్లు... ఇప్పుడేంటబ్బా అంటోంది? ఏం చేయాలి?


couple
File
FILE
చాలా మంది దంపతులు తమ పిల్లలకు వివాహాలై, వారికి పుట్టే పిల్లలకు కూడా పెళ్లిళ్లు అయినా కూడా సెక్స్‌లో పాల్గొనాలని తాపత్రయ పడుతుంటారు. సాధారణంగా 45 నుంచి 50 యేళ్లు దాటిన మహిళల్లో నెలసరి ఆగిపోతుంది. సెక్స్‌పైనా ఆసక్తి తగ్గిపోతుంది. యోనిలో స్రావాలు ఊరడం కూడా బాగా తగ్గిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సెక్స్‌లో పాల్గొనేందుకు బలవంతంగా ఒప్పించినా యోనిలో అంగ ప్రవేశం జరిగీ జరగగానే మంట, నొప్పి ఉంటుంది. దీంతో పురుషులు తీవ్ర నిరుత్సాహానికి లోనవుతుంటారు. ఇదే అంశంపై సెక్స్ వైద్యులను సంప్రదిస్తే.. 

సాధారణంగా మెనోపాజ్ దశలో ఇలాంటి సమస్యలు వస్తుంటాయంటున్నారు. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల యోనిలో స్రావాలు తగ్గి లూబ్రికేషన్ తగ్గిపోయి కలయిక మంటని కలిగిస్తుందని చెపుతున్నారు. దాంతో సెక్స్‌కు దూరంగా ఉండేందుకు ఇష్టపడతారంటున్నారు. ఇది శారీరక కారణం అయితే మానసికంగా కూడా కొంతమంది స్త్రీలు మెనోపాజ్ దశ వచ్చినాక ఇక శృంగార జీవితం ముగిసినట్లే అని భావిస్తారు. 

శృంగారం కేవలం పిల్లల కోసమనో, పిల్లలు పెద్దయ్యారనో రకరకాల మానసిక అవరోధాలతో శృంగార జీవితానికి దూరంగా ఉంటుంటారు. వాస్తవానికి మెనోపాజ్ దశలో శృంగారంలో క్రమం తప్పకుండా పాల్గొనడం వలన జననాంగాల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా న్యూరోట్రాన్సిమిటర్స్ ఎండార్ఫిన్స్ విడుదల కావడం వల్ల మంచి నిద్ర కలుగుతుందని వైద్యులు చెపుతున్నారు. 

దాంతోపాటు మానసిక ప్రశాంతత, శరీరంలో కీళ్ల నొప్పులు తగ్గుతాయంటున్నారు. కాబట్టి మెనోపాజ్ దశలో శృంగారం గురించి పాజిటివ్‌గా ఆలోచించాలంటున్నారు. అయితే, ఈ దశలో సెక్స్‌లో పాల్గొనే వారు లూబ్రికెంట్స్ వాడకం తప్పనిసరని సెక్స్ వైద్యులు సలహా ఇస్తున్నారు.