Saturday 8 September 2012

బహిష్టు అయినా ఆసక్తి ఉంటే సెక్స్‌ చేయొచ్చా!


IFM
IFM
స్త్రీ బహిష్టు అయిన సమయంలో రతి క్రియలో పాల్గొనవచ్చా..? పాల్గొనకూడదా..? అనే ప్రశ్న ప్రతి మగాడిని వేధిస్తూ ఉంటుంది. దీనిపై సెక్సాలజిస్టులు సైతం వారికి తోచిన రీతిలో సమాధానాలు చెపుతుంటారు. బహిష్టు అయిన సమయంలో స్త్రీ సెక్స్ పట్ల ఎలా స్పందిస్తుందన్న అంశంపై ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు వారివారి అభిప్రాయాలు వెల్లడించారు. వాటి ఆధారంగా చేసుకుని పరిశోధకులు ఒక నిర్ణయానికి వచ్చారు. 

బహిష్టు సమయంలో స్త్రీకి పొత్తి కడుపులో నొప్పి, యోనిలో మంట, రక్తస్రావం కలగడం సహజం. దీంతో సహజంగానే చిరాకు పడుతుంది. అలాంటి సమయంలో పురుషుడు తన కోర్కెను తీర్చుకునేందుకు ప్రయత్నిస్తే ఆశాభంగం తప్పదు. అయితే, బహిష్టు అయిన సమయంలో స్త్రీకి మాత్రం సెక్స్‌లో పాల్గొనాలనే కోర్కె ఉంటే మాత్రం పాల్గొనవచ్చని వైద్యులు అంటున్నారు. 

ఎందుకంటే.. కొందరి మహిళల్లో బహిష్టు సమయాల్లోనే సెక్స్ కోర్కెలు ఎక్కువగా కలుగుతాయట. అందువల్ల స్త్రీ కోర్కె మేరకు పురుషుడు మరింతగా రెచ్చిపోవచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే, బహిష్టు సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎలాంటి అనార్థాలు ఏర్పడవని వైద్యులు అంటున్నారు. 

బహిష్టు సమయంలో సెక్స్‌లో పాల్గొనేటపుడు పురుషునిలో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా పాల్గొనడం మంచిది. సెక్స్‌ను ఎంజాయ్ చేయాలంటే మనస్సు ప్రధాన కారణం. స్త్రీ పురుషులంతా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే సెక్స్‌ జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలను సులభంగా అధిగమించవచ్చని పరిశోధకులు పలుకుతున్నారు.