Saturday 8 September 2012

మా ఆయనకు శీఘ్రస్ఖలనం.. నాకేమో సెక్స్ కావాలి? ఏం చేయాలి?

చాలామంది పురుషులకు శీఘ్రస్ఖలనం సమస్య వేధిస్తూ ఉంటుంది. ఇది వివాహమైన తర్వాత కూడా కొనసాగుతుంది. పెళ్లయిన కొత్తలో ఈ సమస్య పెద్దగా లేక పోయినప్పటికీ.. రోజులు గడిచే కొద్ది కనిపిస్తుంటుంది. దీంతో భార్యతోనే సెక్స్‌లో పాల్గొనేందుకు అయిష్టత వ్యక్తం చేస్తుంటారు. మరోవైపు... భార్య మాత్రం సెక్స్‌ కావాలని కోరుకుంటుంది. ఇలాంటి సమస్యకు ఏ విధంగా పరిష్కారం కనుగొనవచ్చన్న అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే... 

శీఘ్రస్ఖలనానికి చికిత్స ఉందంటున్నారు వైద్యులు. దీనికి ఆరంభంలోనే వైద్యం చేయించుకోకుంటే మరింత జఠిలమై అంగస్తంభన లోపానికి దారి తీస్తుందని చెపుతున్నారు. సెక్స్ కోరికలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు. సెక్స్‌లో గ్యాప్ పెరిగినా ఈ సమస్య మరింత అధికమవుతుందని అంటున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భార్యభర్తల మధ్య మానసిక దూరం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. 

స్త్రీలు సెక్స్ కంటే ఎక్కువగా భర్త ప్రేమకే ప్రాముఖ్యతనిస్తారు. అయితే, భార్యల సహకారంతోనే భర్తల సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు అంటున్నారు. శీఘ్రస్ఖలనం తగ్గించే, అంగస్థంభన కాలాన్ని పెంచే ఎక్సర్‌సైజులు చెప్పడంతో పాటుగా పర్‌ఫ్మాన్స్ ఎంగ్జైటీ తగ్గడానికి సైకోథెరపీ, సెక్స్ ఆరోగ్యం కోసం మంచి ఆహార సూచనలు చేస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.