Thursday 20 September 2012

అంగ ప్రవేశం సుళువుగా ఎలా జరిగిందని వేధిస్తున్నాడు?


File
FILE
చాలా మంది భర్తలు తమ భార్యలపై సందేహిస్తుంటారు. ముఖ్యంగా.. పెళ్లైన కొత్తలో భార్యపై ఈ సందేహం ఎక్కువగా ఉంటుంది. శోభనం రోజున అంగ ప్రవేశం సులువుగా జరిగినా.. బ్లీడింగ్ రాకపోయినా.. ఇత్యాది కారణాలతో భార్యలను వేధిస్తుంటారు. మెడలో మూడుముళ్లు పడి కొన్ని గంటలైనా గడవక ముందే.. ఈ ప్రశ్నలతో ఆ యువతి మనస్సు ఆరంభంలోనే బాధపడుతుంది. దీంతో తన భర్తన తనను అనుమానిస్తున్నాడనే ముద్ర పడిపోతుంది. 

ఇలాంటి భర్తల మనస్తత్వాన్ని ఎలా మార్చాలన్న అంశంపై మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తే... సాధారణంగా 99 శాతం అమ్మాయిల్లో ఎగరడం, దూకడం, ఆటలాడటం, సైకిల్ తొక్కడం, బస్సు ఎక్కడం, దిగడం వల్ల యోని నాళాన్ని పూర్తిగానో, పాక్షికంగానో కప్పి ఉంచే 'హైమెన్' అనే పొర చిరిగిపోతుందంటున్నారు. 

హైమన్ పొర ఉండి అంగప్రవేశం కాక రక్తస్రావం అయితేనే కన్య అని నమ్మడం మూర్ఖత్వం. కొన్నిసార్లు హైమన్ మందంగా ఉండి కలయిక సమయంలో రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే.. శృంగారోద్వేగానికి పురుషుడు లోనైనట్లే స్త్రీలు కూడా భర్త స్పర్శతో శృంగారోద్వేగానికి లోనవుతారు. అది శరీర ధర్మ. దాని వల్ల యోనిలో ద్రవాలు స్రవించి లూబ్రికేషన్స్ పెరిగి సులభంగా యోనిలో అంగ ప్రవేశ జరుగుతుందని చెపుతున్నారు. అందువల్ల దీనిపై సందేహించాల్సిన అవరసరం లేదని వైద్యులు సలహా ఇస్తున్నారు.