Tuesday 11 September 2012

శృంగారంలో భార్యని ప్రోత్సహించండి ఇలా.

దంపతుల మధ్య లైంగిక అనుబంధంలో కొన్ని సందర్భాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇద్దరిలో ఏ ఒక్కరిలోనైనా ఈ అనుబంధంపై ఆసక్తి సన్నగిల్లే అవకాశం ఉంటుంది. కొంతమంది మహిళల్లో ఒక వయస్సు దాటగానే బాడీ ఇమేజ్‌కు సంబం ధించిన సమస్యలు ఎదురవుతుం టాయి. అందం, సౌష్టవం, ఆకర్షణ శక్తి తగ్గిపోయా యని, చలాకీగా అనుభవించి, ఆనందించే వయస్సు దాటి పోయిందనే నెగెటివ్‌ ఫీలింగ్స్‌ బలంగా చోటు చేసుకుంటాయి. సెక్స్‌అప్పీల్‌కు సంబంధించిన నెగెటివ్‌ ఫీలిం గ్స్‌ ఉంటే సెక్స్‌పరంగా చొరవ ఉండదు. ఎదు టి వ్యక్తి చొరవను స్వీకరించి, ఆనందించే సానుకూలత ఉండదు. ఈ రెండింటి వల్లా ఆ అనుబంధం పేలవంగా మారిపోతుంది. ఎం తో భర్తలు ఇదే విషయంలో తరచూ ఫిర్యాదు చేస్తుంటారు. ఇందుకు కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి.


‘ఇలా ఉన్నాను..అలా ఉన్నాను’ అనే ఆలోచనను కొంత శ్రమపడి మళ్ళించాలి. పురు షులు, పిల్లల పెంపకం బాధ్యతలు, ఇంటిబాధ్యతలు...ఇవన్నీ మోస్తున్నందువల్ల ఈ వయస్సు లో స్ర్తీలకు మానసిక ఒత్తిడి, శారీరక అలసట ఎక్కువగా ఉంటాయి. ఆమె దినచర్యలో భర్త సహాయం, ఆసరా, మానసిక ఊతం కూడా అందించాలి. ఆమె ఆరోగ్యంగా ఉండేలా ఆహా రం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆమెకి ఆనందం కలిగించే, ఆమె బరువు బాధ్యతలు తగ్గించేలా చేయాలి. ఆమెలో ఉండే ఆకర్షణీయ అంశాలను మెచ్చుకోవడానికి ఏమాత్రం సందేహించకండి. మీరు మీ పట్ల కూడా శ్రద్ధ వహించి ఎల్లప్పుడూ ట్రిమ్‌గా, నీట్‌గా, హుం దాగా ఉండడం అలవర్చుకోండి. పిల్లల గురిం చి, ఇంటి గురించి శ్రద్ధ వహించండి. ప్రౌఢ స్ర్తీలు బాధ్యతాపరుడైన భర్తని చాలా అభిమానిస్తారు. మీ సమస్య క్రమేణా తీరుతుంది.

ఇవి గాకుండా మరికొన్ని వాస్తవాలు కూడా గుర్తించాలి.  పెళ్ళయిన కొత్తలో భార్యాభర్తల సెక్స్‌ కోరికలు, ఉత్సాహమూ సమానంగా ఉన్నట్లు గా ఆ తరువాత ఉండవు.  కొత్తలో ప్రతి ఒక్కరూ తమ భాగస్వామి అవసరాల మీద, అభిరుచుల మీదా మనసు నిలిపి వారిని సం తోషపెట్టడానికి, తృప్తి పరచడానికీ ఎక్కువగా ప్రయత్నిస్తారు. కనుక ఇద్దరి సెక్స్‌ అవసరాలు ఒకేలా ఉన్నట్లు తోస్తాయి. యవ్వనం ప్రభా వం వల్ల కొంత, నూతనానుభవం వల్ల, బాధ్య తలు, బాదరబందీలు లేనందువల్ల కొంత - అప్పట్లో సెక్స్‌వల్‌ యాక్టివిటీ ఎక్కువగానే ఉంటుంది. ఆకర్షణీయంగా ఉండాలన్న ప్రయత్నం ఉంటుంది. అవన్నీ రాను రాను తగ్గిపోతాయి.

తొలి రోజుల సంరంభం, కొత్తదనం, థ్రిల్‌, తగ్గి కామదాహం చల్లారటం మొదలయ్యే సరికి భార్యాభర్తలిద్దరికీ సెక్స్‌ అవసరాల్లోనూ సహజంగా ఉన్న తేడాలు బయటపడుతాయి. ఆ అవసరాల్లో కొన్ని ఎక్కువ తక్కువలు, బయట పరిస్థితుల వల్ల (ఉదా: కాన్పులు, పిల్లల పెంపకం, ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక, మానసిక సమస్యలు, అనారోగ్యాలు, భార్యా భర్తల మధ్య లోపించిన అవగాహన..) కూడా ఏర్పడుతాయి. మొత్తానికి దంపతుల్లో ఒకరికి సెక్స్‌ ఎక్కువ సార్లు కావలసి ఉండడం, రెండో వాళ్ళకి దాని అవసరం తక్కువే ఉండడం సర్వసామాన్యంగా జరుగుతుంది.

కోరిక తీరని వారికి ఆ ఆకలి బాధ ఒకటీ, అది చల్లారలేదనే మానసిక వేదన ఒకటీ - రెండూ కలసి బాధను ఎక్కువ చేస్తాయి. ‘‘భా ర్య నన్నసలు పట్టించుకోదు. ఆమెకు ఆ కోరి కలే లేవు... కావాలని తప్పించుకుంటుంది... ఏడిపించాలని చూస్తోంది..ఎన్నాళ్ళు వదిలేస్తే, అన్నాళ్ళూ అలానే ఉండిపోతుంది’’ అని మీకు అన్పించినట్లే, ‘ఈయనకు ఎప్పుడూ ఆ గొడ వే. అది తప్ప ఇంకో ధ్యాస ఉండదు’’ అని ఆమె అనుకుంటుంది. ఫలితంగా మీరు అడి గే కొద్దీ ఆమె ముడుచుకుపోతుంది. ఆ అవస రాల్లో తేడా ఉన్న దంపతుల మధ్య సామా న్యంగా ఉండే సమస్యే ఇది!

అలాంటప్పుడు దంపతులిద్దరూ స్థిమితం గా చర్చించుకొని, ఒకరి అవసరాలకు అను గుణంగా ఒకరు సర్దుబాట్లు చూసుకోవాలి. మీరు కొంత త్యాగం చేయాలి. ఆమె మరి కొంత ముందుకు వచ్చి మీ అవసరాలు తీర్చా లి. ఒకరి ఇష్టాలను, అయిష్టాలను తెలియ పరుచుకునే స్వేచ్ఛ ఇద్దరికీ ఉండాలి. వాటిని రెండవ వారు ఈసడించుకోకుండా విని అర్థం చేసుకోవాలి. ఆ అభిప్రాయాలను గౌరవించి వాటికి అనుగుణంగా సర్దుకోవాలి.

‘నాకివాళ ఇంట్రస్టు లేదు’ అని ఆమె అంటే ‘నీకెప్పుడు ఇంట్రస్టు ఉంటుంది కనుక, నువ్వెప్పుడూ ఇంతే!’ అని మీరు ఈసడించేరనుకోండి - ఆమె అహం దెబ్బ తింటుంది. మనసు గాయ పడుతుంది. ‘ఎంత చేసినా ఈయనెప్పుడూ ఏమీ చేయలేదనే రోదిస్తాడు. ఇలాంటి మనిషి ని ఎంతకని సంతృప్తిపరచను?’ అని అను కొని మెదలకుంటుంది. తనంత తాను చొరవ తీసుకోవడానికి ఇష్టపడదు. కనుక ఆమె మనసులో కోరిక పుడితే...‘పాపం..ఈయన్ని సంతోషపెడుదాం!’ లాంటి సానుకూల ధోరణి కలిగితే - ఆ పని నిజంగా చేసి చూపించ డానికి కూడా మీ మాటల శూలాలు అడ్డు రాకూడదు.

ఎప్పుడూ సెక్స్‌ని డిమాండ్‌ చేయకండి. కోరండి. తిరస్కరిస్తే, ఆమె మూడ్‌ అనుకూలంగా లేదని గ్రహించి ఊరుకోండి తప్ప సాధించకండి.